ETV Bharat / state

చిన్నారిపై అమానుషం ? స్కూల్​లో ఉపాధ్యాయుడి ఆకృత్యం ! - chintalpudi

చదువుకోవడానికి ఆ పాప స్కూల్​కి వెళ్లనంటోంది... ఏమైందమ్మా అని అమ్మడిగితే ఏడుస్తోంది..! మాస్టారు ఇలా చేస్తున్నారు... అలా చేస్తున్నారని చెప్పుకొచ్చింది... ఏం జరుగుతుందక్కడ..?

చిన్నారిపై అమానుషం ? స్కూల్​లో ఉపాధ్యాయుడి ఆకృత్యం !
author img

By

Published : Aug 3, 2019, 7:18 AM IST

Updated : Aug 3, 2019, 9:05 AM IST

చిన్నారిపై అమానుషం ? స్కూల్​లో ఉపాధ్యాయుడి ఆకృత్యం !

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ఊర్లగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు లైంగిక పాఠాలు నేర్పుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకటో తరగతి చదువుతున్న చిన్నారిపై తోటి విద్యార్థుల చేత లైంగిక దాడి చేయించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయుడే చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మరికొందరు ఆరోపిస్తున్నారు.

3 రోజుల నుంచి పాఠశాలకు వెళ్లేందుకు చిన్నారి భయపడటంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. తనపై ఉపాధ్యాయుడు ప్రవర్తించిన తీరును, శరీరంపై గాయాలను ఆ చిన్నారి తల్లిదండ్రులకు చూపింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు గ్రామస్థుల సహాయంతో సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆ ఉపాధ్యాయుడు కొందరు అధికారులు, స్థానిక పెద్దల సహాయంతో రాజీ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. విద్యార్థుల మధ్య జరిగిన తగాదాలో ఆ చిన్నారికి గాయమైనట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఉపాధ్యాయుడి తప్పిదం ఏమీ లేదంటూనే.. కొందరు ఉపాధ్యాయులను పాఠశాల నుంచి మార్చాలని కోరుతూ కొొందరు గ్రామస్థుల సంతకాలతో ఉన్న లేఖను జిల్లా ఉన్నతాధికారులకు పంపారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి రేణుకను సంప్రదించగా.. విచారణ జరపాలని మండల విద్యాశాఖాధికారిని ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఉదంతంలో ఉపాధ్యాయుల తప్పు లేదని గ్రామస్థుల సంతకాలతో కూడిన లేఖతో ఉన్న నివేదిక తనకు అందిందని ఆమె వెల్లడించారు.

ఇదీ చూడండీ:మద్యం మత్తులో వేగం పెంచారు... ప్రమాదానికి గురయ్యారు..

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు సెంటర్   :  కదిరి జిల్లా      :అనంతపురం మొబైల్ నం     70329754497 Ap_Atp_49_02_Balija_Sangham_Nayakula_Ryally_AVB_AP10004

Body:కాపులకు 5 శాతం రిజర్వేషన్ రద్దు చేయడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో బలిజ సంఘం నాయకులు నల్ల జెండాలతో ర్యాలీ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ లు ఇస్తూ శాసనసభలో తీర్మానం చేసింది. తీర్మానానికి మద్దతు తెలిపిన వైకాపా అధికారంలోకి రాగానే రిజర్వేషన్లను రద్దు చేయడం కక్షపూరిత జరిగాయని నాయకులు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని అని హెచ్చరించారు

Conclusion:బైట్ భైరవ ప్రసాద్,బలిజ సంఘం నాయకుడు
Last Updated : Aug 3, 2019, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.