విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని కొన్ని వలస గ్రామాల్లో ఏనుగులు తిష్ట వేశాయి. వేకువజామున 3గంటల సమయంలో ఏనుగులు గ్రామ సమీపంలో సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాలలో ఏనుగులు ఎక్కువగా సంచరిస్తుండేవి...అయుతే తోటపల్లి ప్రాజెక్టు గుండా అవి పార్వతీపురం మండలంలోకి అడుగుపెట్టాయి. పార్వతీపురం పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఏనుగుల గమనాన్ని గమనిస్తూ...గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. పిన్నింటి రామినాయుడు వలస గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. ఏనుగులు గ్రామాల సమీపంలో ఉన్నందున ఎవరు పొలం పనులకు వెళ్లవద్దని... అధికారులు రైతులకు హెచ్చరించారు. ఆ ఏనుగుల గుంపులను చూసేందుకు తరలివస్తున్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇది చూడండి: 'సైరా'ను పోలిన సమీరా కూతురి పేరు...!