విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించటంలో భాజపా క్విడ్ ప్రోకోకు పాల్పడిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న ప్రభుత్వరంగ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించటం దుర్గార్మపు చర్య అని ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని.. దానిని తప్పకుండా కాపాడుకుంటామని పేర్కొన్నారు. పెట్రో ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారని.., జేబుదొంగల మాదిరిగా ఇటు ప్రభుత్వాలు, అటు చమురు కంపెనీలు దోచుకుంటున్నాయని ఆరోపించారు.
ఇదీచదవండి