ETV Bharat / state

'నాడు బ్లాక్ ​బోర్డ్... నేడు గ్రీన్​ బోర్డ్... భవిష్యత్​లో వైట్ ​బోర్డుకు మారాలి'

author img

By

Published : Mar 4, 2021, 7:34 AM IST

విజయనగరంలో జరుగుతున్న నాడు - నేడు పనులపై ఇంజినీర్లు, మండల విద్యాశాఖ అధికారులతో ప్రాథమిక విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్.. కలెక్టరేట్​లో సమావేశం నిర్వహించారు. మొదటి దశలో ప్రారంభించిన నాడు - నేడు పనులను ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

'నాడు బ్లాక్​బోర్డ్... నేడు గ్రీన్​బోర్డ్... భవిష్యత్​లో వైట్​బోర్డు మారాలి'

విజయనగరంలో జిల్లాలో మొదటి దశలో ప్రారంభించిన నాడు - నేడు పనులను ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ప్రాథమిక విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అధికారులను ఆదేశించారు. రెండో దశ పనులను సుమారు రూ. 4 వేల 400 కోట్లతో ఏప్రిల్ నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాడు - నేడు పనులపై ఇంజినీర్లు, మండల విద్యాశాఖ అధికారులతో రాజశేఖర్.. కలక్టరేట్​లో సమీక్ష నిర్వహించారు. నాడు - నేడు పనులతో పాఠశాలలు దేవాలయాలుగా మారనున్నాయని అన్నారు. ఈ పనులు నాణ్యమైనవిగా ఉంటూ.. పది కాలాల పాటు శాశ్వతంగా నిలిచేలా ఉండాలని అన్నారు.

పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతోనే..

పిల్లలకు ప్రశాంత వాతావరణంలో విద్యాభ్యాసం జరిగేలా చూడాలని అధికారులను రాజశేఖర్ ఆదేశించారు. ఐదో తరగతి వరకు.. విద్యార్థలకు ఆహ్లాదాన్ని అందించేలా, పదో తరగతి వరకు.. విజ్ఞానవంతులుగా ఎదిగేలా తీర్చిదిద్దాలని తెలిపారు. నాడు బ్లాక్​బోర్డ్​లుగా ఉన్నవన్నీ.. నేడు గ్రీన్​బోర్డ్​లుగా మారాయని చెప్పారు. భవిష్యత్​లో వైట్​బోర్డులుగా మారాలని పేర్కొన్నారు. క్షేత్ర పర్యటనలో సందర్శించిన ఆయన కొన్ని పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. వాటిని మోడల్​గా తీసుకోవాలని సూచించారు. నాడు - నేడు పనుల్లో భాగంగా మొదటి దశలో కొన్ని చోట్ల కాంట్రాక్టర్లతో పని చేయించారని.. రెండవ దశలో మాత్రం పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతోనే జరగాలని స్పష్టం చేశారు.

పెట్టుబడిగా భావిస్తోన్న ప్రభుత్వం..

విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన అన్నారు. జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, గోరుముద్ద తదితర పధకాలతో పాటు పిల్లలకు నాణ్యమైన బూట్లు, యునిఫారాలు, పుస్తకాలను ఉచితంగా అందిస్తోందని తెలిపారు. విద్య కోసం ఖర్చు చేసే నిధులను ప్రభుత్వం పెట్టుబడిగా భావిస్తోందని చెప్పారు. అప్పుడే మంచి ఫలితాలను చూడగలమని రాజశేకర్ పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలను తెచ్చామని వివరించారు.

పాఠశాలల రూపు రేఖలు మారిపోవాలి..

పాఠశాల ఆవరణలో, తరగతి గదుల్లో విద్యార్థులు సౌఖ్యంగా ఉండేలా చూడాలని అన్నారు. నాడు - నేడు పనుల్లో భాగంగా డిజైన్ ప్రకారంగానే టాయిలెట్లను నిర్మించాలని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలల రూపు రేఖలు మారిపోవాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ఒక స్టోర్ రూమ్​ను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ మహేష్ కుమార్, ఐటీడీఎ పీఓ ఆర్ కూర్మనాథ్, సబ్​కలెక్టర్ విధేఖరే, సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర అధికారులు, జిల్లా విద్య శాఖాధికారి నాగమణి, ఎస్ఎస్ఏ పీఓ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

విజయనగరంలో ఆ యువతి కాళ్లు, చేతులు కట్టిపడేసింది ఎవరో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.