విజయనగరం జిల్లా గుర్ల మండలానికి చెందిన వాలంటీర్ త్రినాద్.. ఒకటో తేదీ కావటంతో తన వార్డు పరిధిలో పింఛన్ల పంపిణీ చేపట్టాడు. ఈ క్రమంలో... చనిపోయిన ఎర్ర నారాయణమ్మ అనే మహిళకు పింఛన్ అందజేశాడు. మృతురాలి నుంచి వేలిముద్ర సైతం తీసుకున్నాడు. అంతేనా ఏకంగా పింఛన్ అందజేస్తున్నట్లు ఫొటో సైతం తీయించుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అధికారుల మెప్పు కోసమే వాలంటీర్ ఇలా చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై ఆశ్యర్యపోయిన అధికారులు... విచారణకు ఆదేశించారు.
ఇదీ చదవండి