విశాఖ జిల్లా యారాడలో ఓ తండ్రి తన పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేశాడు. మొల్లి శ్రీను తన ఇద్దరు పిల్లలకు బాదం మిల్క్‌లో పురుగుల మందు కలిపి ఇచ్చి.. తాను కూడా తాగాడు.
దీనిని గమనించిన బంధువులు వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తండ్రి శ్రీను, చిన్నారులు అను(14).. చరణ్(10)ల పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఇందుకు కుటుంబకలహాలే కారణమని తెలుస్తోంది.
ఇదీ చదవండి: