ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో గ్రామీణ జిల్లా పరిధి పోలీస్స్టేషన్ల సీఐ, ఎస్సైలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. గత ఎన్నికల్లో గొడవలకు దిగిన వారిని గుర్తించి బైండోవర్ చేయాలని తెలిపారు. 8న పోలింగ్ జరిగే రోజు, 10వ తేదీన ఫలితాలు వెలువడే రోజు చేపట్టాల్సిన బందోబస్తు పై చర్చించారు. ఎన్నికల నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: 8న పరిషత్‌కు పోలింగ్.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు