తెదేపా అధినేత చంద్రబాబు, కార్యకర్తలపై విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుమార్ ఖండించారు. విశాఖ ఎన్టీఆర్ భవన్లో మాట్లాడిన ఆయన... వాసుపల్లి తన ఆస్తులు కాపాడుకునేందుకే వైకాపాకు మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే వాసుపల్లి గణేశ్ కుమార్ రాజీనామా చేసి, ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. తెదేపా ఓట్లతో గెలిచి...ఆ పార్టీపైనా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఇదీ చదవండి : డీఆర్సీ సమావేశంలో రసాభాస... వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే వాగ్వాదం