గుజరాత్, కర్ణాటక, కేరళ, మంగళూరు తదితర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన.. సుమారు 5వేల మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులను సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, విశాఖ నగర తెదేపా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ కోరారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర హోం, ఆరోగ్యశాఖ కార్యదర్శులకు లేఖలు రాశారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఆహారం, తాగునీరులేక వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు.. ఫోను ద్వారా మత్స్యకారుల్ని వివరించారని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'చావుకీ.. బతుక్కీ మధ్య నలిగిపోతున్నాం'