విశాఖ జిల్లా అక్కయ్యపాలెం పరిధిలోని చెక్కుడురాయిలో దివ్య హత్యకేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దివ్య భర్త వీర బాబు, బాబాయి కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ఏలేశ్వరంలో అదుపులోకి తీసుకుని విశాఖకు తీసుకువచ్చారు. వీరిద్దరిపై ఐటీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దివ్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆమె అనైతిక వ్యాపారంలో అడుగుపెట్టడానికి కారణమైనందుకు వీరిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ ఘటనలో కీలక నిందితురాలిగా ఉన్న వసంత నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా పోలీసులు వీరబాబు, కృష్ణను అరెస్టు చేశారు.
దివ్య కేసులో ఇప్పటికే పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారికి రిమాండ్ విధించిన అనంతరం తిరిగి పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం దివ్య హత్య కేసు ఘటనలో విశాఖ నాల్గొవ పట్టణ పోలీసులు ఎనిమిది మంది నిందితులను విచారిస్తున్నారు.
ఇదీ చూడండి.