శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడం సంతోషకరమైన విషయమని తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రతి గ్రామంలోనూ రామాలయలూ వెలుస్తున్నాయి కానీ.. రాముడు జన్మించిన స్వస్థలంలో ఇప్పటివరకు రామాలయం లేకపోవటం బాధకరమైందన్నారు.
వాజ్పేయి, అద్వానీ వంటి నాయకులు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రయత్నాలు చేసినా.. సఫలం కాలేకపోయారనీ.. ఇన్నాళ్లకి మోదీ ప్రభుత్వం నిర్మాణం చేయటం సంతోషించదగ్గ అంశమని అన్నారు. రామ మందిర నిర్మాణం ఎంతో పవిత్రమైన కార్యక్రమమనీ.. ఇందులో హిందువులంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి హిందువు.. పది రూపాయల చొప్పున ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: అనకాపల్లి ఆలయాల్లో వరలక్ష్మి వ్రత ప్రత్యేక పూజలు