విశాఖ మన్యంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. పాడేరు మండలం సూకురుపుట్టులో వెలసిన సూర్య దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ నుంచి లోగేష్ చంద్ గురువులు భక్తులకు సూర్య భగవానుని విశిష్టతలను వివరించారు. దేవాలయంలో పూజలు చేసి నగర సంకీర్తన చేశారు. అనంతరం పలు భక్తి సంఘాలు ఏజెన్సీ ప్రత్యేక నృత్యమైన థింసా డ్యాన్స్ వేసి అలరించారు.
ఇదీ చదవండి: విశాఖ జిల్లాలో రథసప్తమి వేడుకలు