మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి టి.రమేష్‌ను సబ్‌రిజిస్ట్రార్ (ఎస్ఆర్వో) గా అధికారులు నియమించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎస్ఆర్వోగా పని చేస్తున్న ఆయన్ను డిప్యుటేషన్‌పై ఉన్నతాధికారులు బదిలీ చేశారు. మంగళవారం కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించిన మేరకు.. ఆయన మధురవాడ కార్యాలయానికి చేరుకున్నారు. అధికారిక ఉత్తర్వులు అందని కారణంగా.. బాధ్యతలు ఇంకా స్వీకరించలేదని తెలిసింది.
మధురవాడలో ఇన్నాళ్లూ పని చేసిన ఎస్ఆర్వో తారకేషు.. మంగళవారం ఉదయం ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేసినట్లు సమాచారం. ఈ విషయమై డీఐజి నాగలక్ష్మి మాట్లాడుతూ.. గతంలో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు జరిగిన అన్ని కార్యాలయాల అధికారులనూ మార్చామని చెప్పారు. అందులో భాగంగానే తారకేషును మధురవాడ నుంచి బదిలీ చేశామన్నారు.
ఇదీ చదవండి: