విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో పరిశ్రమలన్నీ కరోనా వైరస్ ప్రభావం వల్ల మూతపడడంతో 20 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎక్కువ మంది కావడంతో వీరంతా తిండి కరువై అల్లాడుతున్నారు. అచ్యుతాపురం మండలంలో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేసి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. బ్రాండిక్స్ అపెరల్ పార్కు లో 18 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు. ఇతర పరిశ్రమల్లో మరో రెండు వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వీటిని మూసివేసి 20 రోజులు దాటిపోవడంతో కార్మికులంతా వీధిన పడ్డారు. దాతలు అందించే భోజనం తిని జీవిస్తున్నారు. ఈ కార్మికుల కోసం శిబిరాలు ఏర్పాటుచేసి వీరికి భోజన వసతి కల్పించాలని కార్మికులు కోరుతున్నారు. రహదారులన్నీ పోలీసులు మూసివేయడం వల్ల బయటకి వెళ్ళే అవకాశాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి మహారాష్ట్రలో 24 గంటల్లో 368 కేసులు నమోదు