ETV Bharat / state

స్పందించిన అధికారులు..గిరి చిన్నారుల సమస్యలకు పరిష్కారం - గిరిజన చిన్నారుల ఆధార్ సమస్య తాజా సమాచారం

చదువు కోసం ఆ గిరిజన చిన్నారులు చేసిన పోరాటం ఫలించింది. సామాజిక మాధ్యమాల ద్వారా అధికారులు, ప్రజా నాయకులు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్పందించి గిరి బిడ్డల సమస్యలను పరిశీలించి చర్యలు చేపట్టారు.

Tribal children
గిరిజన చిన్నారులు
author img

By

Published : Aug 25, 2021, 1:48 PM IST

విశాఖ జిల్లా జి మాడుగుల, రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ సరిహద్దులోని ఓ కుగ్రామం అధికారుల రికార్డులో లేకపోవటంతో.. అక్కడి ప్రజలకు ఆధార్ కార్డులు లేవు. దీంతో ప్రజలు ప్రభుత్వ పథకాలు, పిల్లలు చదువుకు దూరం అయ్యారు. ఏలా అయినా చదువుకోవాలనే కోరికతో గిరిజన చిన్నారులు నిరసన బాట పట్టారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో హల్​చల్​ కావటంతో.. అధికారులు గుర్తించి వారి సమస్యలను పరిష్కరించటానికి ముందుకు వచ్చారు.

గిరిజన శాఖ మంత్రి పుష్పశ్రీవాణి వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలంటూ ఐటీడీఏ పీవోను ఆదేశించారు. రంగంలో దిగిన జి.మాడుగుల ఎంపీడీవో వెంకన్న బాబు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఆదేశాలతో జి.మాడుగుల ఎండీ ఓ వెంకన్నబాబు డిప్యూటీ తహసీల్దార్ అప్పలస్వామితో కలిసి కొండలు, సెలయేరు గుండా నడిచి వెళ్లి ఆ గ్రామాన్ని సందర్శించారు అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆధార్, ఓటర్, రేషన్, జాబు కార్డులతో పాటు అంగన్వాడి సెంటర్, ఆశా కార్యకర్తను ఇవ్వడానికి ఎండిఓ వెంకన్నబాబు రంగం సిద్ధం చేశారు. విద్యుత్తు సమస్య ఉందని.. సోలార్ ప్లాంట్ మరమ్మతులు చేస్తామన్నారు.

గిరి చిన్నారుల సమస్యలపై స్పందించిన అధికారులు

ఆధార్ కార్డులు ఇప్పించండి.. బడికి వెళ్తాం..

జి.మాడుగుల మండల కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల కొండ దిగువున రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ సరిహద్దులో నేరేడు బండ గ్రామం ఉంది. అక్కడ సుమారు 50 మంది గిరిపుత్రులు నివసిస్తున్నారు. వీరిలో 18 మంది చిన్నారులకు ఆధార్ కార్డులు లేవు. ఏ పాఠశాలకు వెళ్లాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అనటంతో.. ఆధార్ సెంటర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా.. జనన ధ్రువపత్రాలు అడుగుతున్నారు. గిరి పల్లెల్లో పుట్టడంతో ఆ పత్రాలు వారి వద్ద లేవు. దీంతో "ఆధార్ కార్డులు ఇప్పించండి.. బడికి వెళ్తాం" అంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.

ఇదీ చదవండీ.. Tribal children: రికార్డుల్లో లేని గ్రామం.. అందని ధ్రువీకరణ పత్రాలు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.