విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అవంతి శంకుస్థాపనలు చేశారు. అల్లూరి స్వగ్రామం పాండ్రంగి లో గోస్తనీ నదిపై వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పాండ్రంగి ప్రజల చిరకాల కోరిక అయిన లోలెవెల్ బ్రిడ్జి నిర్మాణం.. తన హయాంలో జరుగుతుడటం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రూ.14 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టామన్నారు. 18 నెలలలో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. అభివృద్ధి పనులలో భాగంగా రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రెడ్డిపల్లి నుంచి చిన్నాపురం రహదారి పనులకు మంత్రి అవంతి శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనకాపల్లి డీఎస్పీ