విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయాలనే కేంద్రం ఆలోచనను వ్యతిరేకిస్తున్నట్టు ఐఎన్టీయూసీ నేత సంజీవరెడ్డి చెప్పారు. కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లాభాల బాటలో ఉన్న కేంద్ర కంపెనీలను ప్రైవేట్ వారికి ఇస్తే నిరుద్యోగ సమస్య వస్తుందని చెప్పారు.
భాజపా ప్రభుత్వం కేవలం ప్రైవేట్ పెట్టుబడి దారుల మేలు మాత్రమే చూస్తోందని ఆరోపించారు. దిల్లీలో రైతు ఉద్యమం అనంతరం.. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ కంపెనీలు ప్రైవేట్ పరం చేస్తున్న అంశంపై పోరాటం మొదలవుతుందని కేంద్రాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి: