విశాఖ జిల్లా అనకాపల్లిలోని దిశ పోలీస్ స్టేషన్ లోని ఎస్సైకి కరోనా నిర్ధరణ అయింది. సోమవారం ఈ స్టేషన్ ను రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. దీంతో భయాందోళనలు నెలకొన్నాయి. విశాఖపట్నం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్, అనకాపల్లికి చెందిన మహిళ, గవరపాలెంకి చెందిన వృద్ధుడు, లక్ష్మీదేవి పేటకు చెందిన వ్యక్తికి కరోనా సోకింది. మంగళవారం అనకాపల్లిలో మొత్తం ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు అనకాపల్లిలో కరోనా సోకిన వారి సంఖ్య 102కి చేరింది. వీరిలో 32 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఇదీ చదవండి: 'ఆయన మరణం లేని మహానేత'... వైఎస్ఆర్కు సీఎం జగన్ నివాళి