Security failure in Tirumala: గత కొంత కాలంగా తిరుమలలో జరుగుతున్న ఘటనలపై భక్తుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో సీఎంవో వాహనం చక్కర్లు కొట్టింది. దానిపై సీఎం కార్యాలయానికి సంబంధించిన వాహనంగా సూచించే స్టిక్కర్లు ఉన్నాయి. మాడవీధుల్లో ప్రైవేటు వాహనాల రాకపోకలకు తితిదే అనుమతి నిషేధించింది. ఇటీవల శ్రీవారి ఆలయానికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
తిరుమలలో భద్రతను పెంచి శ్రీవారి భక్తుల మనోభావాలను కాపాడాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి మాడవీధులలో సీఎంఓ స్టికర్ ఉన్న వెహికల్ ప్రవేశించడంపై భక్తుల ఆందోళన చెందడంతో ఆయన స్పందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపించారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందించిన తీరుపై ఆయన విమర్శలు చేశారు. వీఐపీలకు సేవలు చేయడంపై ఉన్న శ్రద్ద తిరుమలలో భక్తులకు సౌకర్యాలు కల్పించడం, భధ్రత కల్పించడంపై లేవని ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
ఇవీ చదవండి: