ETV Bharat / state

వృథా జలాలను ఒడిసి పట్టేందుకు... నాగావళిపై 2 రిజర్వాయర్లు! - వృథా జలాలను ఒడిసి పట్టేందుకు...

వర్షాకాలంలో సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను ఒడిసిపట్టేందుకు శ్రీకాకుళం జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం నాగావళి నదిపై 2 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. 2.46 టీఎంసీల నీరు నిల్వ ఉంచాలన్న లక్ష్యంగా పనులు కొనసాగిస్తున్నారు.

వృథా జలాలకు అడ్డుకట్ట
వృథా జలాలకు అడ్డుకట్ట
author img

By

Published : Dec 1, 2020, 12:37 PM IST

Prevent waste water
వృథా జలాలకు అడ్డుకట్ట

వర్షాకాలంలో ఎగువ నుంచి పరవళ్లు తొక్కుతూ వస్తున్న వరద నీటిని నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. దాదాపు ఏటా 70 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. మరోవైపు పంటలకు సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా ఏదో ఒకచోట పంటలు ఎండిపోతూనే ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా జిల్లా జలవనరుల శాఖ అడుగులు వేస్తోంది. జిల్లాలో కొత్తగా రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి అవకాశాలను పరిశీలిస్తున్నారు. నాగావళి నదిపై నిర్మించే ఈ రెండింటి ద్వారా కనీసం 2.46 టీఎంసీల నీటిని ఒడిసి పట్టాలనేదే లక్ష్యం. ఇందులో భాగంగా ఇటీవల నిపుణులతో కూడిన బృందం ఆయా ప్రాంతాలను పరిశీలించింది.

మడ్డువలస సమీపంలో..!

వంగర మండలంలోని మడ్డువలస రిజర్వాయరు నుంచి దిగువకు వచ్చే జలాలన్నీ నారాయణపురం ఆనకట్టను దాటుకుని సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. ఆ నీటిని నారాయణపురం ఆనకట్టకు ఎగువన అంటే మడ్డువలస దగ్గరే ఒడిసిపట్టాలని అధికారులు భావిస్తున్నారు. సువర్ణముఖి, నాగావళి నదులు కలిసే చోట మడ్డువలసకు సమీపంలోని సంగర గ్రామంలో పనసనందివాడలో మరో జలాశయాన్ని నిర్మించడానికి ఉన్న అవకాశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వంశధార, నాగావళి నదుల అనుసంధాన పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయితే వంశధార జలాశయం నుంచి నారాయణపురం ఆనకట్టకు మళ్లిస్తారు. ఆనకట్ట సామర్థ్యం బాగా తక్కువ కావడంతో అక్కడ నిర్మించే రిజర్వాయర్‌కి ఆ నీటిని మళ్లిస్తారు. అంటే నారాయణపురం దగ్గర నిర్మించే రిజర్వాయర్‌కి ఇన్‌ఫ్లో అనుసంధాన కాలువ ద్వారా వస్తుంది. అయితే మడ్డువలసకి ఎగువ నుంచి వచ్చే వరద నీటిని వృథాగా కిందకు వదలకుండా అక్కడే నిలిపితే మరింత ఎక్కువ నీటిని నిల్వ చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే రెండో జలాశయాన్ని నిర్మించడానికి అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

నారాయణపురం వద్ధ.!

నారాయణపురం ఆనకట్ట నాలుగున్నర దశాబ్దాల కిందట నిర్మించారు. ప్రస్తుతం అందులో కనీసం 0.5 టీఎంసీల నీరు కూడా నిలవడం లేదు. ఆనకట్ట పరిస్థితి దయనీయంగా మారింది. అక్టోబరు, నవంబరు నెలల్లో వాయుగుండాలు, తుపాన్ల వల్ల కురిసిన వర్షాలకు నాగావళి, వంశధార నదులకు వరద పోటెత్తింది. 40-50 వేల క్యూసెక్కుల ప్రవాహంతో నీటిని దిగువకు విడిచిపెట్టారు. ఎగువన ఉన్న తోటపల్లి, మడ్డువలస జలాశయాలు నిండగా మిగిలిన నీటిని నాగావళి ద్వారా సముద్రంలోకి విడిచిపెట్టారు. కనీసం 30 టీఎంసీలకు పైగా మిగులు జలాలు సముద్రంలో కలిసిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అలా వృథాగా పోతున్న నీటినే ఒడిసిపట్టి సాగు, తాగునీటిగా వినియోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఏటా నష్టాలే..

జిల్లా వ్యాప్తంగా రబీ పంటలు సాగుచేసే రైతులు నష్టాలే చవిచూడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా నాగావళి నదీ పరీవాహక ప్రాంతంలోని భూములు. సమయానికి నీళ్లు అందక బీడుగానే మారుతున్నాయి. వంగర, ఆమదాలవలస, రేగిడి, రణస్థలం ప్రాంతాల్లో ఏటా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు పక్క నుంచే నాగావళి నీరు వెళ్లిపోతున్నా దానిని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఫలితంగా కరవుఛాయలు అలముకుంటున్నాయి.

గొట్టా బ్యారేజీ దగ్గరలో వంశధార రిజర్వాయరు నిర్మాణంలో ఉంది. వంశధార నదిలో మిగులు జలాలను రిజర్వాయరుకు తరలించి నిల్వ చేసి అక్కడి నుంచి అనుసంధాన కాలువ ద్వారా నారాయణపురం ఆనకట్ట ఎగువ ప్రాంతానికి తరలించే ప్రక్రియ పనులు పూర్తయ్యాయి. అంత పెద్దది కాకపోయినా అదే తరహాలో నారాయణపురం ఆనకట్టకు దగ్గరలో ఒక రిజర్వాయర్‌ నిర్మించి ఆ నీటిని ఇక్కడ నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఎంత నిల్వ చేసుకుంటే అంత ప్రయోజనం

ఏటా చాలా నీరు సముద్రంలోకి వృథాగా పోతోంది. దాన్ని ఒడిసిపట్టుకోవాలనేదే ప్రధాన లక్ష్యం. తర్వాత జిల్లా అవసరాలకు అనుగుణంగా సాగు, తాగు నీటికి వినియోగించుకోవచ్ఛు ఎంత నీటిని నిల్వ చేసుకోగలిగితే జిల్లాకు అంత మేలు. సమయం వృథా చేసుకోకుండా రైతులు పంటలు సాగు చేసుకోవచ్ఛు ఖరీఫ్‌కి కొంతమేర నీరివ్వగలుగుతున్నా రబీకి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రబీకి సాగునీరు దృష్టిలో పెట్టుకునే ఈ నిర్మాణాలపై ముందుకెళ్తున్నాం. - ఎస్‌.వీ.రమణారావు, జలవనరుల శాఖ ఎస్‌ఈ

ఈ ప్రాజెక్టులు పూర్తయితే..

పాలకొండ, బూర్జ, ఆమదాలవలస, రేగిడి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, సంతకవిటి మండలాల్లోని భూములకు రెండు పంటలకూ సాగునీరు అందించవచ్ఛు ఆయా మండలాల రైతులకు ఖరీఫ్‌లో కొంతమేర నీరందుతున్నా రబీకి వచ్చేసరికి తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

రబీ సాగుకు దన్నుగా

ఆయా ప్రాంతాల్లో రిజర్వాయర్లు నిర్మిస్తే ఎంత మేరకు భూసేకరణ జరపాల్సి వస్తుంది? ప్రస్తుతం అక్కడ ధరలు ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో ఎంతమేర పెరగొచ్చు? రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రకృతి పరంగా కలిసొచ్చే అంశాలు ఏమిటి? రిజర్వాయర్‌లో ఏ మేరకు నీటిని నిల్వ చేస్తే ఏఏ గ్రామాలు ముంపునకు గురవుతాయి? ఎంత మందికి పునరావాసం కల్పించాల్సి వస్తుంది? ప్రాజెక్టుల నిర్మాణం ఏమేరకు లాభదాయకంగా ఉండనుంది? తదితర అంశాలన్నిటిపై నిపుణుల బృందం నిశితంగా పరిశీలన చేస్తోంది.

ఇదీ చదవండి:

సర్కారు జలం.. రోగాలు ఉచితం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.