శ్రీకాకుళం జిల్లా బంటుపల్లిలోని ఉన్న యునైటెడ్ బ్రేవెరీస్ పరిశ్రమ (యూబీ)లో పనిచేస్తున్న దారపురెడ్డి వెంకటరావు అనే కార్మికుడు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాాడు. అతడి కుటుంబ సభ్యులకు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆర్ధిక సహాయం అందించారు.
అంతా ముందుకు వచ్చి..
తమతో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన వెంకటరావు కుటుంబాన్ని ఆదుకోవడానికి పరిశ్రమలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు అంతా ముందుకు వచ్చి ఆర్ధిక సహాయం అందించారు. కార్మికులందరికీ పూర్తి స్థాయిలో పనిదినాలు లేకపోయినా తమకు వచ్చిన కొద్దిపాటి జీతం నుంచే ప్రతి ఒక్కరూ తమ ఒక్క రోజు వేతనం విరాళంగా వసూలు చేసి మొత్తం రూ. 2,19,760 లక్షలు పోగు చేశారు.
మృతుడి భార్యకు అందజేత..
అనంతరం బాధిత కుటుంబీకుల సమక్షంలో మృతుడి భార్య రమణమ్మ, కుమారుడు దుర్గాప్రసాద్లకు పరిశ్రమ వద్ద సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, యూబీ వర్కర్స్ యూనియన్ కార్మికుల సమక్షంలో ఆర్థిక సహాయాన్ని అందచేశారు.
అందరికీ ఆదర్శం..
కార్మికుల చైతన్యాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సీఐటీయూ ప్రధాన కారదర్శి తేజేశ్వరరావు అన్నారు. యాజమాన్యం కార్మిలందరికీ పూర్తి స్థాయి పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యునైటెడ్ బ్రేవెరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు ఇజ్జు నారాయణరావు, జాక గంగరాజు, కోశాధికారి సి.హెచ్.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.