ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు యథాతథంగా నిర్వహించేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో.. తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అధికారులు... ఎన్నికల సామగ్రితో సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపారు. ఈ రాత్రికే వారు అక్కడికి చేరుకొని అవసరమైన ఏర్పాట్లు చేసుకోనున్నారు. 54 పోలింగ్ కేంద్రాలను 7 రూట్లు, 2 జోన్లుగా విభజించారు. గురువారం జరగనున్న పరిషత్ ఎన్నికల్లో సుమారు 240 మంది అధికారులు పాల్గొననున్నారు.
ఆమదాలవలసలో
ఆమదాలవలస మండలంలో పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ బీవీ పద్మ అన్నారు. ఎన్నికల సిబ్బందికి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
మండలంలో మొత్తం 52 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఒక స్థానం ఏకగ్రీవమైంది. దీంతో 12 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఇదీచూడండి: