ETV Bharat / state

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: మంత్రి అప్పలరాజు - మంత్రి అప్పలరాజు

సముద్ర తీరప్రాంత మత్స్యకారులు చేపల వేటకు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ప్రతి జిల్లాకు ఒక హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి ఎస్. అప్పలరాజు తెలిపారు. ప్రధానమంత్రి సంపద యోజన పథకం కింద మంజూరైన ఐదు లక్షల చేప పిల్లలను శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మడ్డువలస జలాశయంలో విడిచిపెట్టే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులుతో కలిసి మంత్రి పాల్గొన్నారు.

madduvalasa-jalasyamlo-cheapa-pillalu-vidichipeattina-minister-appalaraju
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
author img

By

Published : Aug 4, 2021, 8:05 AM IST

తీరప్రాంత మత్స్యకారులు చేపల వేటకు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ప్రతి జిల్లాకు ఒక హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మత్స్య, పశువర్ధక శాఖ మంత్రి ఎస్. అప్పలరాజు తెలిపారు. ప్రధానమంత్రి సంపద యోజన పథకం కింద మంజూరైన ఐదు లక్షల చేప పిల్లలను శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మడ్డువలస జలాశయంలో విడిచిపెట్టే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులుతో కలిసి మంత్రి పాల్గొన్నారు.

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని..మత్స్య సంపద మార్కెట్లో అమ్ముకునే సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఆక్వా రంగం రైతు నష్టపోకుండా ధర నిర్ణయించిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని అన్నారు. కోవిడ్ కష్టకాలంలో ఆక్వా రంగం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు.

మడ్డువలస జలాశయంలో ఉన్న బుడగ తామర చేపల వేటకు ఇబ్బంది కలిగిస్తుందని మత్స్యకారులు మంత్రికి తెలియజేశారు. పలువురు మత్స్యకారులు వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి అప్పలరాజు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

అలా మోహన్‌బాబును క్లైమాక్స్‌ వరకు పొడిగించాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.