ETV Bharat / state

పురుషులకు చురకలు.. మహిళలకు హెచ్చరికలు.. మంత్రి ధర్మాన హితోక్తులు - Minister Dharmana PrasadaRao senstional comments

Minister Dharmana Prasada Rao sensational comments: వైసీపీ పాలనలో మహిళలకు వస్తున్న సంక్షేమ పథకాలను చూసి.. చాలా మంది పురుషులు జీర్ణించుకోలేక పోతున్నారని.. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళల ఆత్మగౌరవం పెంచేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేయకపోతే.. సంక్షేమ పథకాలన్నీ రద్దయి పోతాయని మహిళలను హెచ్చరించారు.

మగవాళ్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎమన్నారంటే..?

author img

By

Published : Mar 29, 2023, 5:08 PM IST

Minister Dharmana Prasada Rao sensational comments: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా హడ్కో కాలనీల నిర్వహించిన ఆసరా పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వైసీపీ పాలనలో మహిళలకు వస్తున్న సంక్షేమ పథకాలను చూసి.. చాలా మంది పురుషులు జీర్ణించుకోలేక పోతున్నారని.. మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల ఆత్మగౌరవం పెంచేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేయకపోతే.. సంక్షేమ పథకాలన్నీ రద్దయి పోతాయని మహిళలను హెచ్చరించారు.

ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..'' సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో స్త్రీలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి.. ఇంట్లోని చాలా మంది మగవాళ్లు జీర్ణంచుకోలేకపోతున్నారు. మగవారు తినేసి వెళ్లిపోతారు. వారికి ఎటువంటి బాధ్యతలు పట్టవు. ఇంట్లో అన్ని పనులు సమకూర్చుకునేది ఆ ఇంటి ఇల్లాలు మాత్రమే. ఆ ఇంటిని నడిపేది కూడా ఆ ఇల్లాలే. అందుకే ప్రభుత్వం అన్ని పథకాలను ఇళ్లాలి పేరుతోనే ఇస్తోంది. ప్రతి ఇల్లాలు ఈ విషయాన్ని దృష్టింలో పెట్టుకోవాలి. ఇటీవలే కాలంలో ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమానికి గార మండలంలోని ఓ గ్రామానికి వెళ్లాను. అక్కడ నాకు ఎదురైన వింత అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఓ వృద్ధురాలిని సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగాను. దానికి ఆమె అన్నీ అందుతున్నాయని చెప్పింది. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఓటు ఎరికి వేస్తావు అని అడిగాను. దానికి ఆ వృద్దురాలు సైకిల్‌ గుర్తుకు వేస్తానని చెప్పింది. కాబట్టి అలాంటి వారికి పార్టీ గుర్తులపై అవగాహన కల్పించాల్సిన ఎంతో ఉంది. ఎందుకంటే మహిళలకు పథకాలు ఇస్తుంది వైసీపీ ప్రభుత్వం. ప్రభుత్వ పథకాలపై ఆయా గ్రామాల కార్యకర్తలు వృద్దులకు, మహిళలకు, యువతకు అవగాహన కల్పించాలి.'' అని ధర్మాన అన్నారు.

అనంతరం మహిళల ఆత్మగౌరవం పెంచేందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఓటు హక్కు కీలకమన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేయ్యలన్నారు. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని హెచ్చరించారు. ఇక, రాష్ట్రంలో పెరిగిన ధరలపై మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని చోట్ల ధరలు పెరిగాయని, ఆ ధరలే రాష్ట్రంలో కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయన్నారు. ఈ క్రమంలో మగవారిపై మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదంగా మారాయి.

మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.