YCP Councillors Protest: వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్.. తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ కౌన్సిలర్లు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. హిందూపురంలో సచివాలయ కన్వీనర్ల ఎంపిక ప్రక్రియలో తమ ప్రమేయం లేకుండా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్.. తనకిష్టం వచ్చిన వారిని ఎన్నుకున్నారని.. అసమ్మతి వర్గం ఆరోపించింది. తాము కౌన్సిలర్లుగా గెలిచి రెండేళ్లు అవుతున్నా.. ఎటువంటి అధికారిక కార్యక్రమాలకు పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇవీ చదవండి: