అనారోగ్యం కారణంగా మనస్థాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన శేషారత్నం(55) అనే మహిళ... మధుమేహంతో పాటు పలు వ్యాధులతో బాధ పడుతోంది. వైద్యశాలలో చికిత్స తీసుకున్నప్పటికీ రోగాలు నయం కాకపోవటంతో మనస్థాపానికి గురైన ఆమె... పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శేషారత్నం మృతి చెందింది. ఈమె గతంలోనూ ఓసారి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దీనిపై వేటపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి...