ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త చరిత్రకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి అన్నారు. చిత్తూరులోని డీఎస్ఏ స్టేడియంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీకి కేటాయించిన 724 వాహనాలను ఆయన ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా డోర్ డెలివరీ వాహనాలను సబ్సిడీపై అందించి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని చెప్పారు. నాణ్యమైన స్వర్ణ బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, కలెక్టర్ భరత్ గుప్తా, ఎమ్మెల్యేలు ఎమ్.ఎస్ బాబు, ద్వారకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలో..
కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన 56 రేషన్ పంపిణీ వాహనాలు ఆయా మండల కేంద్రాలకు చేరాయి. కనిగిరి-15 , చంద్రశేఖరపురం-9, హనుమంతునిపాడు-7, పామూరు-12, పెద్ద చెర్లోపల్లి-7, వెలిగండ్ల-6 వాహనాలను సిద్ధం చేశారు. వీటికి మొదటగా ట్రయల్ రన్ నిర్వహించి... సంబంధిత సచివాలయాలకు అప్పజెప్తామని కనిగిరి తాహసీల్దార్ తెలిపారు.
ఇదీ చదవండి: