ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లిలో ఓ వర్గం వారిపై దాడి ఘటన మరువకు ముందే.. అదే మండలంలోని మద్దలకట్టలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసిన సోదరులు మూల సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి ఓటమి పాలయ్యారు. తమ ఓటమికి కారణమయ్యారంటూ... వారు తంగిరాల జార్జి అనే వ్యక్తిపై దాడికి దిగారు. వైకాపాకు ఓట్లు వేయలేదనే కారణంతోనే.. కావాలనే తగాదా పెట్టుకుని దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు.
ఇదీ చదవండి: atchannaidu: ఎస్సీలను అణచివేయడమే వైకాపా నైజం: అచ్చెన్నాయుడు