ప్రకాశం జిల్లాలో ఆరెంజ్ జోన్ కింద ఉన్న జే.పంగులూరు మండలంలో పనుల కోసం కర్నూలు జిల్లా వాసులు 50 రోజుల క్రితం మండలానికి వచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 347 మంది వలస కూలీలను తిరిగి వారి స్థలానికి పంపాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఆ మేరకు అధికార యంత్రాంగం, పోలీస్ సిబ్బంది ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వారికి ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పంపించడం జరిగింది.

ఇదీ చదవండి :