ప్రభుత్వం మద్యం విక్రయం కోసం పంపిణీ చేస్తున్న టోకెన్లతో ప్రజలు బారులు తీరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని 8 దుకాణాల్లో... 3,200 టోకెన్లు పంపిణీ చేశారు. మార్కాపురం పట్టణ పరిధి కంటైన్మెంట్లో ఉండడంతో 4 దుకాణాల్లో మద్యం సరఫరా నిలిపివేశారు.
మిగిలిన 8 చోట్ల టోకెన్ల కోసం.. జనం భారీగా తరలివచ్చారు. వచ్చిన వారి సంఖ్య ఎక్కువవడంతో 2 రోజులకు సరిపడా టోకెన్లు ఒకేసారి పంపిణీ చేశారు. తీవ్ర ఎండను సైతం లెక్కచేయకుండా.. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా మందు ప్రియులు క్యూలో నిల్చున్నారు.
ఇదీ చదవండి: విశాఖలో గ్యాస్ లీక్ : ఈ జాగ్రత్తలు తీసుకోండి!