మహా శివరాత్రి సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, పర్చూరు, చినగంజాం శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చినగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం శివాలయాల్లో అర్థరాత్రి నుంచి భక్తులు అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేస్తున్నారు.
శివ నామస్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి. సోపిరాల శివాలయ కమిటీ అధ్యక్షుడు టీఎస్ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో సాయంత్రం భారీ విద్యుత్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలతో తిరునాళ్లు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి. మహాశివరాత్రి వేడుకలకు కోటప్పకొండ ముస్తాబు..