వైకాపా ప్రభుత్వం దళిత పక్షపాతి అని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకరావు అన్నారు. ప్రతిపక్షాలు ఎస్సీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసుల దాడిలో మృతి చెందిన ఎస్సీ యువకుడు యెరిచర్ల కిరణ్ కుటుంబాన్ని కనకరాజు పరామర్శించారు.
చీరాల ఘటన తెలిసిన వెంటనే సీఎం జగన్ స్పందించారన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న భరోసా ఇవ్వటమే కాకుండా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. కిరణ్ మృతిప్తె స్పెషల్ అధికారులతో నిజనిర్ధారణ కమిటీ వేయడం జరిగిందని.. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ల ఆధారంగా కిరణ్ మృతికి కారకులైన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై సోమవారం హోం మినిస్టర్ కు నివేదికను అందజేస్తామని పేర్కొన్నారు.