ప్రకాశం జిల్లా కనిగిరిలో అధికారులు శుక్రవారం నుంచి మంగళవారం వరకు 5 రోజులపాటు లాక్డౌన్ ను ప్రకటించారు. కనిగిరి చుట్టుప్రక్కల గ్రామాల్లో రోజురోజుకు కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
లాక్డౌన్ సమయంలో ఎటువంటి దుకాణాలు తెరుచుకోవని అధికారులు తెలిపారు. కనిగిరి చుట్టుప్రక్క గ్రామాల ప్రజలందరూ ఈ లాక్డౌన్ కు సహకరించాలని, ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమై కరోనాను తరిమికొట్టాలని అధికారులు కోరారు.