విద్యాకానుక కిట్లను మండలకేంద్రాల నుంచి గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలకు చేరవేసే కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కనిగిరిలో సమగ్ర శిక్షా అభియాన్ సీఎంవో రాజాల కొండారెడ్డి ప్రారంభించారు.
విద్యాకానుక కిట్లలో ఒక బ్యాగ్, పాఠ్యపుస్థకాలు, రాత పుస్థకాలు, మూడు జతల ఏకరూప దుస్తులు, ఒక జత బూట్లతో పాటుగా రెండు జతల సాక్సులు ఉంటాయని సీఎంవో తెలిపారు. జిల్లాలోని 56 మండలాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్దిని విద్యార్థులకు ఉచితంగా సెప్టెంబర్ ఐదో తేదీన పంపిణి చేస్తామన్నారు. జిల్లాలో 3 లక్షల 15వేలమంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలకు విద్యాకానుక సామగ్రిని చేరవేశామని... మండలకేంద్రాల నుంచి గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలకు చేరవేసే కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి