ప్రభుత్వ ఇసుక నిల్వ కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించనుండటంతో.. ప్రకాశం జిల్లాలో అక్రమ తరలింపుకు పాల్పడ్డారు. రాత్రి సమయంలో ఇసుక తరలిస్తున్న వాహనాలను పర్చూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో సెబ్ అధికారులు పట్టుకున్నారు. స్థానికంగా ఉన్న ఇసుక నిల్వ కేంద్రం బాధ్యతలు నేటి నుంచి ప్రైవేటు సంస్థ చేతుల్లోకి వెళ్లనుంది. దీంతో నిన్న రాత్రి కొందరు వ్యక్తులు టిప్పర్లలో ఇసుక లోడు చేసి తరలించారు. అది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే దాడులు నిర్వహించి.. ఒక జేసీబీ, నాలుగు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నామని ఈఎస్ అరుణకుమారి తెలిపారు. అప్పటికే కొంత ఇసుకను తరలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఎస్ఈబీ ఎస్సై, స్థానిక ఎస్సై వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: మంగళగిరిలో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఆఫీస్ కూల్చివేత