ETV Bharat / state

'జగన్ ప్రజాసమస్యలు గాలికొదిలేసి.. కాంట్రాక్టులు కట్టబెట్టే పనిలో నిమగ్నం' - Nellore District viral news

EX-Minister Somireddy harsh comments on CM Jagan: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెదేపా మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ రెడ్డి.. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, తన బినామీలకు, వారి సంస్థలకు వేల ఎకరాలు, వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను కట్టబెట్టే పనిలో నిమగ్నమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Somireddy
జగన్ రెడ్డి కాంట్రాక్టులను కట్టబెట్టే పనిలో నిమగ్నమయ్యారు
author img

By

Published : Jan 10, 2023, 6:00 PM IST

EX-Minister Somireddy Comments on CM Jagan: ప్రజా సమస్యలను గాలికొదిలేసి.. సీఎం జగన్ రెడ్డి తన బినామీలకు, వారి సంస్థలకు వేల ఎకరాలు, వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను కట్టబెట్టే పనిలో నిమగ్నమయ్యారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 4,827 ఎకరాలు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేశారని ఆరోపించారు.

కోర్టులో కేసు విచారణలో ఉండగానే జగన్ రెడ్డి గెజిట్ నోటిఫికేషన్‌తో భూముల స్వాధీనానికి ఎందుకు ఆరాటపడుతున్నాడని ప్రశ్నించారు. ఆఖరికి శ్మశానాల్ని కూడా వదలకుండా ప్రభుత్వం.. అధికారులతో ప్రజల్ని బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో ట్రాన్స్​ఫార్మర్లు రిపేర్ చేసుకునే వ్యక్తి, అతని కంపెనీ 33వేల కోట్లతో సోలార్ ప్యానెల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. రాయామపట్నం పోర్టు కార్యక్రమాలు మొదలైతే, ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూమి విలువ దాదాపు ఎకరం 50 లక్షల నుంచి కోటికి పెరుగుతుందని.. ఆ లోపే భూమిని తన వశం చేసుకోవాలని జగన్ రెడ్డి కుట్ర పన్నారని ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.