నెల్లూరు జిల్లాకే తలమానికమైన ప్రాజెక్టు సోమశిల. నివర్ తుపాన్ ప్రభావంతో సోమశిల జలాశయానికి భారీగా వరద వచ్చింది. జలవనరుల శాఖ అధికారులు నీటిని దిగువకు వదిలారు. దీంతో ఆప్రాన్, ఎడమ గ్యాబిన్ పూర్తిగా దెబ్బతిన్నాయి. నాలుగు నెలలు కావస్తున్నా జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల కమిటీ కూడా వచ్చి పరిశీలించిందని.. ఇప్పటివరకు అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని రైతులు అంటున్నారు.
జలాశయంపై ఆధారపడి 20 వేల మంది జీవనం సాగిస్తున్నామని జాలర్లు చెబుతున్నారు. దెబ్బతిన్న చోట త్వరగా మరమ్మతులు చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: కృష్ణపట్నంలో కరోనా మందు.. పరిశీలిస్తున్న ఆయుష్ నిపుణులు