కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో... మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కోవూరులోని రుక్మిణి కళ్యాణ మండపంలో సుమారు 2500 మందికి బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలను అందజేశారు. రేషన్ కార్డు లేని పేదలకు, పూజారులు, ఇమామ్లు, పాస్టర్లు, ఆశా వర్కర్లకు వీటిని అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేయూతనివ్వడం అభినందనీయమని మంత్రి కొనియాడారు.
ఇదీ చదవండి: