నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో లాక్ డౌన్ అమలు చేశారు. పట్టణంలో 110కిపైగా కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇటీవల కాలంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు దుకాణాల నిర్వహణకు పురపాలక శాఖ అనుమతినిచ్చింది. ఆదివారం పట్టణంలో జనసంచారం లేకుండా చేయాలనే ఆలోచనతో పగలు పూట పూర్తిగా అన్ని రకాల దుకాణాలకు అనుమతి లేకుండా ఆదేశాలిచ్చారు. ఫలితంగా పట్టణంలోని అన్ని దుకాణాలు మూతపడ్డాయి.
ఇదీ చూడండి
రాజధాని వికేంద్రీకరణపై న్యాయపోరాటం చేస్తాం..: జనసేన అధినేత పవన్