ETV Bharat / state

'పుష్ప' సీన్ రిపీట్ చేస్తూ.. తారు ట్యాంకర్లలో కల్తీ మద్యం: సోమిరెడ్డి

author img

By

Published : Apr 1, 2022, 3:44 PM IST

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా కల్తీ మద్యాన్నినెల్లూరుకు తరలిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆక్షేపించారు. పుష్ప సినిమాలో పాల ట్యాంకర్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్లు తారు ట్యాంకర్లలో వైకాపా నేతలు కల్తీ మద్యం స్మగ్లింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

'పుష్ప' సీన్ రిపీట్ చేస్తూ.. తారు ట్యాంకర్లలో కల్తీ మద్యం

పుష్ప సినిమాలో పాల ట్యాంకర్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్టుగా.. తారు ట్యాంకర్లలో వైకాపా నేతలు కల్తీ మద్యం స్మగ్లింగ్ చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లేబుల్ మార్చి అమ్మే కల్తీ మద్యంలో వందల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. 2014 ఎన్నికల్లో పంచేందుకు నెల్లూరు జిల్లా సర్వేపల్లి, కావలి ఎమ్మెల్యేలు కల్తీ మద్యం తీసుకురాగా గతంలోనే వారిపై 11 కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ప్రతి కేసులోనూ గోవా, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక స్మగ్లర్లు పట్టుబడ్డారన్న సోమిరెడ్డి.. నాటి కేసుకు తాజాగా నెల్లూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం సంఘటనలు ముడిపడి ఉన్నాయన్నారు.

గతంలో గోవా, పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు మీదుగా కల్తీ మద్యం రవాణా జరిగినట్లే ఇప్పుడూ జరిగిందని సోమిరెడ్డి ఆరోపించారు. అక్రమ మద్యం రవాణా వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపిస్తే.. అన్ని విషయాలతోపాటు తెరవెనుక పెద్దల పాత్ర బయటకు వస్తుందన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా కల్తీ మద్యాన్ని తారు ట్యాంకర్లు, నాటు పడవల్లో నెల్లూరుకు తరలిస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు.

ఇదీ చదవండి: నిన్న గోవా.. నేడు పుదుచ్చేరి.. నెల్లూరులో ఇతర రాష్ట్రాల మద్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.