మద్ధతు ధర పేరుతో అధికార పార్టీ నాయకులు.. నెల్లూరు జిల్లా రైతులను దోపిడీ చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టి.. అన్నదాతను దగా చేశారని ఎద్దేవా చేశారు.
జిల్లాలోని ఎమ్మెల్యేలు.. రైతుల గురించి ఆలోచించడం లేదని సోమిరెడ్డి ఆరోపించారు. తెదేపా పాలనలో ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించామని తెలిపారు. వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. మద్ధతు ధర పేరిట జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'రావాల్సిన సొమ్ముకంటే అధికంగా ఎందుకు వచ్చిందని అడిగితే తప్పా.?'