నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య.. కరోనాకు ఆయుర్వేదం మందు ఇవ్వడాన్ని ప్రభుత్వం అడ్డుకోవడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వేలాది మంది ఆ ఔషధాన్ని వినియోగించినా.. ఏ ఒక్కరి నుంచి ఫిర్యాదు రాలేదని తెలిపారు. ఆధునిక సాంకేతికత, ఖర్చుతో కూడుకున్న మందులు ఉపయోగిస్తున్నా.. ఆయా ఆస్పత్రుల్లో రోజూ కొవిడ్ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: ఉచిత టీకా కోసం మోదీకి మాజీ ఐఏఎస్ల లేఖ
వైద్యశాలలో పడకలు, ఆక్సిజన్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా.. ఉచితంగా మందు ఇచ్చి ప్రాణం పోస్తున్న ఆనందయ్య వైద్యంపై ఆంక్షలు విధించడం సరికాదని సోమిరెడ్డి అన్నారు. సాధ్యమైనంత వరకు ఆయనకు తోడ్పాటు అందించి ప్రోత్సహించాలని ప్రభుత్వానికి సూచించారు. అక్కడ క్యూ లైన్లలో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.
అనుబంధ కథనం: