నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామంలోని క్రికెట్ ఆడుకునే మైదానంలో అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఈ పూజలు నిర్వహించారు. పెద్ద బొమ్మ గీసి అందులో రంగులు వేశారు. నిమ్మకాయలు, గుమ్మడికాయలు పెట్టి.. మేకులు కొట్టారు. నల్లటి కోడిని కూడా బలి ఇచ్చారని స్థానికులంటున్నారు. క్రికెట్ ఆడేందుకు క్రీడాకారులు మైదానం దగ్గరకు వెళ్లటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు క్షుద్ర పూజలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: