నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి బాలయోగి గురుకులంలో కరోనా కలకలం రేపుతోంది. 14 మంది విద్యార్ధినులకు కరోనా సోకినట్లు వైద్యాధికారి చలపతి గౌడ్ పేర్కొన్నారు. ఈ నెల 20న 73 మంది విద్యార్ధినిలకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 14 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. సోమవారం ఉదయం విద్యార్ధినిలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి: విజయవాడలో ఆక్సిజన్ కొరత..రోగులకు తప్పని కష్టాలు