ETV Bharat / state

వికటించిన మధ్యాహ్న భోజనం.. 34 మంది విద్యార్థులకు అస్వస్థత

Food poisoning: ప్రభుత్వ పాఠశాలలో 'జగనన్న గోరు ముద్ద' మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్తకు గురయ్యారు. మెుత్తం34మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు వెల్లడించారు. విద్యార్థల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.

1
1
author img

By

Published : Mar 2, 2023, 8:42 PM IST

34 Students Ill After Eating: గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్​లో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపించి విద్యార్థు అనారోగ్యం పాలు కావడం తరుచూ చూస్తూనే ఉన్నాం. ఇంత జరుగుతున్నా విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు. అలాంటి ఘటనే పల్లాడు జిల్లాలో చోటు చేసుకుంది. కలుషితమైన ఆహారం తినడంతో చిన్నారులు అస్వస్థతనకు గురయ్యారు. వెంటనే స్పందించిన పాఠాశాల సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని విద్యార్థుల తల్లిదండ్రులు వెల్లడించారు.

పల్నాడు జిల్లా శావల్యాపురం ప్రభుత్వ పాఠశాలలో 'జగనన్న గోరు ముద్ద' పేరిట మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. ప్రతిరోజు మాదిరిగానే నేడూ చిన్నారులు మధ్యాహ్న భోజనం చేశారు. కానీ భోజనం చేసిన కొద్ది సేపటికే విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఘటనకు సంబందించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా గురువారం సాంబారు బాత్, టమాటా చట్నీని విద్యార్థులకు అందించారు.

ఆహారం తీసుకున్న అనంతరం విద్యార్థులు 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలో కడుపులో నొప్పి, వాంతులు చేసుకోవడం ప్రారంభించారని పేర్కొన్నారు. మొత్తం 130 మంది విద్యార్థులు భోజనం చేయగా, వారిలో సుమారు 34మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని శ్రీనివాసరావు తెలిపారు. ఘటనపై స్థానిక ఆరోగ్య సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వారు పాఠశాలకు వచ్చి వైద్యం అందజేశారు. వారిలో 23 మంది విద్యార్థులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపి చికిత్స అందించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. వారిలో మరో 8మందికి నీరసంగా ఉండటంతో సెలైన్, ఇంజెక్షన్లు ఇచ్చి వైద్యం అంచినట్లు తెలిపారు. 8మంది విద్యార్థులకు కూడా స్వస్థత చేకూరినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వేమూరి వెంకట భాస్కర్ మాట్లాడారు. ప్రస్తుతానికి విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.

'నేను ఈ మధ్యనే ఈ పాఠశాలకు వచ్చాను. మెుత్తం 130మంది విద్యార్థులు ఆహారం తీసుకున్న తరువాత అందులో 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు అనుకోని చిన్న ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పక్కనే ఉన్న ఆసుపత్రిలో జాయిన్ చేశాం. ఇలాంటి ఘనటనలు మళ్లీ జరగకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తాను.'- జె. శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.