ETV Bharat / state

RTC Employees Bills Peding: లంచం ఇస్తే సరి.. లేకుంటే నెలల తరబడి వేచి చూడాల్సిందే - ap news

RTC Employees Bills Pending: ఖజానా శాఖలో బిల్లులు మంజూరు కోసం ఆర్టీసీ ఉద్యోగులు ముప్పతిప్పలు పడుతున్నారు. పీఆర్​సీ బకాయిలు, ఇతర బిల్లుల మంజూరు కోసం అష్టకష్టాలు పడుతున్నారు. 9 నెలలుగా తిరుగుతున్నా నగదు అందని దుస్ధితి నెలకొందని ఉన్నతాధికారుల ముందు వాపోతున్నారు. చేయి తడపనిదే దస్త్రంపై ఆమోద ముద్రపడటం లేదని ఖజానా శాఖ తీరుపై ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 25, 2023, 11:50 AM IST

ఆర్టీసీ ఉద్యోగులు బిల్లుల మంజూరు కోసం అష్టకష్టాలు

RTC Employees Bills Pending: రూపాయి అదనంగా తీసుకున్నారని కండక్టర్, డ్రైవర్లను తొలగించిన నిప్పు కణికలు మీరు.. ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే చాలు సిబ్బందిని సస్పెండ్ చేయడంలో ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా స్పందిస్తారు మీరు.. పీఆర్​సీ బకాయిలు, ఇంక్రిమెంట్ల బిల్లులు ఖజానా విభాగంలో క్లియర్ చేసేందుకు.. డ్రైవర్, కండక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తుంటే, నిజాయితీ ఏమైపోయింది? లంచమిచ్చేందుకు వసూళ్లపర్వం సాగుతుంటే ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు? లంచమడిగితే టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయండని ప్రచారంతో హోరెత్తిస్తున్న ప్రభుత్వానికి ఇదేమీ కనిపించదా? ఏసీబీ యంత్రాంగానిది అంతా బిల్డప్పేనా?' ఇది ఆర్టీసీ ఉద్యోగుల వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న మెసేజ్. ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన వివిధ బకాయిల కోసం ఖజానా విభాగం అధికారులు, సిబ్బంది ముప్పతిప్పలపై ఆర్టీసీ ఉద్యోగుల ఆవేదన ఇది.

లంచం ఇస్తేనే బకాయిలు : ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనంకాక ముందు జీతాలు, ఇతర బకాయిలు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చెల్లింపులు జరిగేవి. సంస్థలోని అకౌంట్స్ అధికారులు పారదర్శకంగా బిల్లులు మంజూరు చేసేవారు. 2020, జనవరి నుంచి వీరంతా ప్రభుత్వంలో వీలీనమయ్యారు. తర్వాత కొద్ది రోజులు ఆర్టీసీ ద్వారానే జీతాలు, ఇతర బకాయిలు చెల్లించారు. గతయేడాది నుంచి ఖజానాశాఖ ద్వారా చెల్లింపులు మొదలవ్వడంతో, వీరి కష్టాలు ఆరంభమయ్యాయి. ప్రతి బిల్లుకి కొంత మొత్తం ఇవ్వాల్సిందేనని ఖజానాశాఖ సిబ్బంది పట్టుబడుతున్నారని ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జీతాల బిల్లులు, ఇతర సప్లిమెంటరీ బిల్లులయినా చేయి తడపాల్సిందేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లంచం ఇవ్వకుంటే నెలల తరబడి బకాయిల కోసం ఎదురుచూడాల్సిన వస్తోందని.. ఉన్నతాధికారుల ముందు ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారు.

పీఆర్​సీ బకాయిల బిల్లులు : ఆర్టీసీ ఉద్యోగులకు గతయేడాది సెప్టెంబరులో పీఆర్​సీ అమల్లోకి తెచ్చారు. అయితే జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల పీఆర్​సీ బకాయిలు కూడా చెల్లించేలా ఆదేశాలిచ్చారు. అనేక డిపోల్లో డీడీవోలు ఈ మేరకు పీఆర్​సీ బకాయిల బిల్లులు అప్‌లోడ్‌ చేస్తుంటే.. ఖజానా అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. ప్రత్యేకంగా జీవో రావాలని, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలని సాకులు చెబుతున్నట్లు ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారు. కొన్ని డిపోల్లో మాత్రం పీఆర్​సీ బకాయిలు బిల్లులు క్లియర్‌ చేశారు. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు డిపో సిబ్బందికి మాత్రమే బకాయిలు చెల్లించారు. మిగిలిన ఆరు డిపోల సిబ్బందికి ఇవ్వలేదు.

ప్రశ్నిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు : ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, బగానపల్లె డిపోలు మినహా, మిగిలిన డిపోల సిబ్బందికి బకాయిలు ఇంకా అందలేదు. ఉత్తరాంధ్రలో పలాస, సాలూరు, విజయనగరం, ఎస్​.కోట, పాడేరు డిపో ఉద్యోగులకే బకాయిలు వచ్చాయి. ఓ ఖజానా కార్యాలయ పరిధిలో బకాయిల బిల్లులు చెల్లించేందుకు అడ్డురాని నిబంధనలు, ఇతర ఖజానాశాఖ కార్యాలయాల పరిధిలో ఎలా వస్తాయని ఆర్టీసీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

పట్టించుకోని ఆర్టీసీ ఉన్నతాధికారులు : ఆర్టీసీ ఉద్యోగులకు ఆటోమెటిక్‌ అడ్వాన్స్‌ స్కీమ్‌ అమల్లోకి వచ్చింది. అంటే 6, 12, 18, 24, 30 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి ఓ ఇంక్రిమెంట్‌ కలుస్తుంది. ఉద్యోగులు ఆ వివరాలతో బిల్లులను ట్రజరీకి పంపితే వాటిని తిరస్కరిస్తున్నారని చెబుతున్నారు. ఉద్యోగి సిక్‌ అయినపుడు చెల్లించాల్సిన జీతం, సప్లిమెంటరీ బిల్లులు పంపినా ఆమోదించడంలేదని చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని, ఖజానాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను ఎందుకు పరిష్కరించట్లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

'ట్రెజరీ డిపార్ట్‌మెంట్ పారదర్శకమైనా విధానం లేదు. జిల్లాలో 12 డిపోలు ఉంటాయి. ఒక డిపోలో ఇస్తారు.. ఇంకో డిపోలో ఇవ్వరు. ఒక యూనిట్​లో ఎస్​టీఓ ఇస్తారు. ఇంకో యూనిట్​లో ఇవ్వరు. మేము అడిగితే మాత్రం జీవో లేదని అంటున్నారు.'- రమణారావు, ఆర్టీసీ ఎన్‌ఎంయూ అధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.