రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో భద్రపరిచిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని తరలించారు. కలెక్టర్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ ప్రక్రియ సాగింది.
నగరపాలక సంస్థ కార్యాలయంలో కొన్నిరోజుల క్రితం అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో.. భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను, ఇతర సామాగ్రిని అన్ని రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో తరలించినట్టు నగర పాలక సంస్థ కమిషనర్ బాలాజీ తెలిపారు.
ఇదీ చదవండి: "ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించండి"