ETV Bharat / state

శ్రీశైలం నుంచి భారీ వరద... నిండుకుండలా నాగార్జునసాగర్‌

శ్రీశైలం నుంచి భారీగా వస్తున్న వరదతో కృష్ణమ్మ.. నాగార్జున సాగర్ దిశగా పరుగులు పెడుతోంది. నిండుకుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్ సైతం గరిష్ఠ నీటిమట్టానికి చేరువకావడంతో.. గేట్లు ఎత్తి నీటిని వదిలేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో... తెలంగాణలోని గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి.. క్రమంగా ఉగ్రరూపం దాల్చుతోంది.

Srisailam
శ్రీశైలం నుంచి భారీ వరదతో నిండుకుండలా నాగార్జునసాగర్‌
author img

By

Published : Aug 21, 2020, 9:33 AM IST

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.తెలంగాణలోని ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. జూరాల జలాశయానికి ఎగువన ప్రాజెక్టుల నుంచి 3 లక్షల 45 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి ప్రవాహ ఉద్ధృతి పెరుగుతుండటం వల్ల.. 39 గేట్లు తెరిచి 3 లక్షల 52 వేల 221 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి.. కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తోంది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో మొత్తం 10 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం 4లక్షల 17వేల 582 క్యూసెక్కుల వరద వస్తోంది. 3లక్షల 45 వేల 899 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

  • నిండుకుండలా సాగర్​

శ్రీశైలం నుంచి పరుగులు తీస్తున్న వరద ప్రవాహం.. నాగార్జునసాగర్​కు పోటెత్తుతోంది. ప్రస్తుతం లక్షా 69 వేల 620 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. 30 వేల 342 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సాగర్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలకు గాను... 271.37 టీఎంసీల నిల్వఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. 575.70 అడుగుల వద్ద ఉంది. 585 అడుగులకు చేరుకుంటే... గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సాయంత్రం పూర్తి స్థాయి మట్టానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలకు... నాగార్జున సాగర్‌ అధికారులు అప్రమత్తం చేశారు. జాలర్లు చేపల వేటకు నదిలోకి దిగవద్దని, పర్యటకులు సైతం నది దగ్గరకు రావొద్దని.. స్పష్టం చేశారు.

  • భద్రాద్రిలో మళ్లీ మూడో ప్రమాద హెచ్చరిక

గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులు జలసిరులతో తొణికిసలాడుతున్నాయి. ఎగువ నుంచి తెలంగాణలోని శ్రీరామసాగర్​కు వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఎస్‌ఆర్‌ఎస్పీలోకి 30 వేల 491 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండగా.. 863 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా... ప్రస్తుతం 1,085.50 అడుగులుగా ఉంది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటినిల్వ 90.31 టీఎంసీలు ఉండగా.. ఇప్పటికే 68.43 టీఎంసీలకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులు... నిండుకుండను తలపిస్తున్నాయి. ఇక ఎల్లంపల్లి జలాశయంలో.. ఎగువన కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టులో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఎల్లంపల్లిలోకి 85 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక భద్రాచలం వద్ద శాంతించినట్లే కనిపించిన గోదావరి మళ్లీ నెమ్మదిగా ఉగ్రరూపం దాల్చుతోంది. నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని జలాశయనికి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టులోకి 60 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 12 గేట్లు ఎత్తి 70 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు రిజర్వాయర్ 24 గేట్లను ఎత్తి లక్షా 40వేల 375 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

ఇదీ చదవండి- ముగిసిన కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.