తిన్నా.. తినకపోయినా.. ఆఖరికి మంచి నీళ్లు కూడా లేకపోయినా.. స్వగ్రామం చేరుకోవటమే లక్ష్యంగా.. వలస కార్మికులు కష్టాల కడలి ఈదుతున్నారు. కర్నూలులో చిక్కుకుపోయిన ఝార్ఖండ్ రాష్ట్ర వలస కూలీలు.. తమ దగ్గర ఉన్న కాసిన్ని డబ్బులతో సైకిళ్ళు కొనుగోలు చేసి ప్రయాణం ప్రారంభించారు.
ఐదు రోజుల క్రితం ప్రయాణం ప్రారంభించి ప్రకాశం జిల్లా దర్శికి చేరుకున్నారు. రోజుకు 100 నుంచి 120 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ దారిలో తినడానికి తిండి, నీళ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరిని గమనించిన దాతలు ఇచ్చే ఆహారంతో సరిపెట్టుకొని ప్రయాణం కొనసాగిస్తున్నారు.
ఇవీ చూడండి: