కర్నూలు జిల్లా బేతంచర్ల మండల కేంద్రానికి చెందిన యువకుడి పేరు లింగాల రవికుమార్. 2002లో కరాటే నేర్చుకుంటుండగా.. కాలికి గాయం అయ్యింది. ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఎదురైన అనుభవం రక్తదానం చేసేలా ప్రేరేపించిందని రవి కుమార్ చెబుతున్నాడు
లైఫ్ రక్త సహాయ బృందం..
మరోసారి డాక్టర్ బ్రహ్మారెడ్డితో కలిసి నెల్లూరులో జరిగిన రక్తదాతల సమావేశానికి హాజరయ్యాడు రవి కుమార్. అక్కడివారి మాటల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొని... రక్తదానం చేయటం వల్ల ఎంతోమందిని కాపాడవచ్చని తెలుసుకున్నాడు. అదే అదునుగా స్నేహితులు, బంధువులు, తన ఊళ్లోనివారిని ఒప్పించి 2003వ సంవత్సరంలో లైఫ్ రక్త సహాయ బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఇందులో ప్రస్తుతం 10 వేల మంది సభ్యులు ఉన్నారు
తన సేవలు అద్భుతం
- కేవలం రక్తదానానికే పరిమితంగా కాకుండా మరిన్ని విభాగాలు సేవా కార్యక్రమాల చేపడుతున్నాడు రవికుమార్. ఇప్పటి వరకు 15వేల యూనిట్ల రక్తం దానం చేసిన ఈ బృందం నేత్రదానం చేయాలని సైతం నిర్ణయించారు. 2006 డిసెంబర్ 18న లైఫ్ యువనేత్ర సంస్థ స్థాపించారు. దీని ద్వారా ఇప్పటి వరకు 350 మంది నేత్రదానం, 700 మంది కార్నియా దానం చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకు సుమారు 60 అనాథ శవాలకు అత్యక్రియలు నిర్వహించారు.
- 2015లో అన్నపూర్ణ చిన్నపిల్లల అనాథ శరణాలయం ఏర్పాటు చేశారు. ఇందులో 17 మంది పిల్లలను సంరక్షిస్తున్నారు. వీరిని ఓ ప్రయివేటు స్కూల్లో చదివిస్తున్నారు. ప్రయివేటు యాజమాన్యం సైతం ఎలాంటి ఫీజులు తీసుకోకుండా ఉచితంగా చదువు చెప్పిస్తోంది. శరణాలయానికి ఉస్సేన్ రెడ్డి అనే దాత 35 లక్షల విలువ చేసే ఓ భవనాన్ని సైతం ఉచితంగా ఇచ్చా
- కరోనా కష్టకాలంలోనూ వీరి సేవా కార్యక్రమాలు ఆగలేదు. ఎన్నో కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా రోగులకు తమ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులకు చేర్చారు. అత్యవసరమైనవారికి ఆక్సిజన్ సిలిండర్లను సైతం అందించారు. అనాథలకు సేవ చేస్తు.... ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించటం పట్ల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు ఎంతోమందికి సాయంగా ఉంది.
రవికుమార్ వేసిన ఒక అడుగు.... ఇప్పుడు ఎంతోమంది తన వెంట నడిచేలా చేసింది. తన సేవా కార్యక్రమాలకు కుటుంబసభ్యులు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారు. శరీరాలను దానం చేసేందుకు సైతం వారు ముందుకు వచ్చారు.
తమ సేవలు కావాలనుకునేవారు వాట్సప్ ద్వారా ఎప్పుడైనా సంప్రదించవచ్చని అంటాడు రవికుమార్. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా రక్తం కావాలనుకునేవారు 8121677227 వాట్సప్ నంబర్ కు సమాచారం ఇస్తే చాలు. వీరి కార్యక్రమాల గురించి తెలుసుకోవాలనుకునేవారు లైఫ్ రక్తసహాయ బృందం అనే ఫేస్ బుక్ పేజ్ లో చూడవచ్చని రవికుమార్ చెబుతున్నారు
ఇదీ చూడండి. తెరుచుకున్న పాఠశాలలు... కొవిడ్ నిబంధనలు తప్పనిసరి